శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్ ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు తన కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పదవీ వ్యామోహంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో ఏమీ జరగకున్నా.. చంద్రబాబునాయుడు కావాలనే ప్రజల సింపతీ కోసం ఇలా తన భార్య పేరును అడ్డుపెట్టుకుని నాటకం ఆడుతున్నాడని, పదవీ వ్యామోహంతోనే మీడియా ముందు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడి దొంగ ఏడుపులను కుటుంబ సభ్యులు నమ్మవద్దని హెచ్చరించారు.
ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. మహనీయుడు ఎన్‌టీఆర్ కడుపున పుట్టిన గొప్ప మనస్సు ఉన్న వ్యక్తి బాలకృష్ణ అని.. కానీ చంద్రబాబు చేసిన మోసాన్ని హెచ్చరించినా.. బాలకృష్ణ పట్టించుకోలేదని అన్నారు. చంద్రబాబు పదవీ వ్యామోహం కోసమే దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని.. ఆయన నటన ఆస్కార్‌ను మించిపోయిందని ధ్వజమెత్తారు. ఆయన దొంగ ఏడుపులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.
చంద్రబాబు ఒక నీచుడు, నికృష్టుడు అని లక్ష్మీ పార్వతి అన్నారు. మహిళలను కించపరిచి వాడుకుంటున్నది చంద్రబాబే. లబ్ది కోసం ఎలాంటి పనైనా చేయగల సిద్ధహస్తుడు చంద్రబాబు. అధికార పిచ్చి పట్టిన మృగం. గతంలో వైఎస్సార్ కుటుంబంపై చంద్రబాబు నీచ ప్రచారం చేశాడు. నేరుగా ప్రజల్లో గెలవలేక బురద జల్లడంలో చంద్రబాబు ఘనుడు.. అని లక్ష్మీ పార్వతి అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…