Krithi Shetty : తొలి చిత్రంతోనే కృతి శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఉప్పెన మూవీతో కృతి శెట్టి ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి. కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే ఘన విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ అంతగా ఆకట్టుకోలేదు.
కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రంలో.. సూర్య సరసన మరో చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో అయినా ఐరెన్ లెగ్ ముద్ర తొలగించుకోవాలని కృతి శెట్టి భావిస్తోంది. దీంతో కృతి శెట్టి గ్లామర్ ఇంటెన్స్ పెంచేసినట్లు అర్థం అవుతోంది. తాజాగా కృతి శెట్టి వైట్ డిజైనర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. స్కిన్ కి హగ్ ఇచ్చినట్లుగా ఉన్న శారీలో కృతి శెట్టి వయ్యారాలు ఒలకబోస్తోంది.

కృతి శెట్టి ఈ రేంజ్ లో అందాలు అరబోయడంతో చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వయ్యారంగా తన బాడీని వంచుతూ నడుము సోయగాలు చూపిస్తోంది. అన్ని యాంగిల్స్ తో తన పరువాలతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. సుధీర్ సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీపై కృతి ఎన్నో ఆశలు పెట్టుంది. ఈ చిత్రం కూడా ఏదైనా తేడా కొడితే కృతిశెట్టి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ లు చేరినట్లు అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో.