Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన సంతాప సభను సొంత ఊరు మొగల్తూరులో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభాస్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు ప్రభాస్ కూడా అక్కడికి వెళ్లాడు. ప్రభాస్ సన్నిహితులు వారం రోజుల ముందు నుండే అక్కడ ఏర్పాట్లను ప్రారంభించారు. లక్ష మందికి పైగా హాజరయ్యేలా ప్రచారం చేశారు. అయితే లక్ష 20 వేల మందికి సరిపోయే ఆహార పదార్థాలను వడ్డించాలని ముందుగా ప్లాన్ చేశారు. అందుకోసం బడ్జెట్ 3 కోట్ల రూపాయలను కేటాయించారు.
ఈ రూ.3 కోట్లను ప్రభాస్ తన ఖాతా నుండి ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల ఆస్తి కృష్ణంరాజు ఫ్యామిలీ సొంతం, అయినా కూడా పెదనాన్నపై ఉన్న అభిమానంతో ప్రభాస్ 3 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడంట. ప్రభాస్ 3, 4 రోజుల నుండి స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నాడని సంతాప సభ ఏర్పాట్లు చేసిన వారంటున్నారు. ఈ సంతాప సభలో పెట్టిన భోజనం మెనూ గురించి కొన్ని సంవత్సరాల వరకు అభిమానులు మరిచిపోలేని రేంజ్ లో ఉందట. ఇంతకు భోజనంలో ఏం వడ్డించారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఐటమ్స్ వివరాల్లోకి వెళితే.. 6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల మటన్ బిర్యానీ, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు, 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు ఉన్నాయి. జాబితా చూస్తుంటే కాస్త ఖర్చైనా మొగల్తూరు వెళ్లి రెబల్ స్టార్ ఇంట భోజనం చేస్తే బాగుండేది అనిపిస్తుంది కదా.. ఇది తెలిసిన నెటిజన్లు ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజు ఎక్కడున్నా రాజే అంటూ అభినందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…