Krishna : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది. అందులో భాగంగానే మహేష్ ఫ్యాన్స్ కూడా సినిమా హిట్ అయ్యే సరికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ చానల్ మాత్రం పనిగట్టుకుని మరీ సర్కారు వారి పాట మూవీపై తొలి రోజు నుంచే బురద జల్లడం ప్రారంభించింది. దీనికి రాజకీయ రంగు పులిమి నెగెటివ్ టాక్ మొదలు పెట్టింది. దీంతో ఆ చానల్‌పై మహేష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీగా ట్రోల్ చేశారు.
ఇక సర్కారు వారి పాట సినిమాపై నెగెటివ్ టాక్‌ను ప్రచారం చేయడంపై సూపర్ స్టార్ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ గత కొన్నేళ్లుగా సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తున్నాడని.. ఇలాంటి అవకాశం అందరు హీరోలకు రాదని అన్నారు. సర్కారు వారి పాట కూడా మంచి మెసేజ్ మూవీ అని.. తాను ఈ మూవీ దూకుడు, పోకిరి కన్నా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పానని.. సరిగ్గా అలాగే జరిగిందని అన్నారు.
కాగా ఈ మూవీపై ఓ చానల్ నెగెటివ్ టాక్‌ను ప్రచారం చేయడంతో కృష్ణ స్పందించారు. కొందరు కావాలని పనిగట్టుకుని ఇలా చేస్తున్నారని అన్నారు. మహేష్ మొదటి నుంచి వివాద రహితుడని.. సౌమ్యంగా ఉంటాడని.. అతనిపై నిందలు వేయడం.. అతని సినిమాపై నెగెటివ్ టాక్‌ను ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. రాజకీయ కోణంలో సినిమాను చూడవద్దని అన్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…