Krishna Family : సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యామిలీని గత కొంతకాలంగా దురదృష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నవంబర్ 15 తెల్లవారుజామున 4:09 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ ఒక్క ఏడాదిలోనే మహేష్ బాబు కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటే అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం జనవరి 8న కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్‌బాబు అనారోగ్యంతో మృతి చెందారు. కృష్ణ ఉండగానే కాలేయ వ్యాధితో బాధపడుతోన్న రమేష్‌బాబు తీవ్ర అనారోగ్యంతో చిన్న వయస్సులోనే మృతి చెందడం కృష్ణను మానసికంగా కలిచి వేసింది.
తండ్రి తర్వాత తండ్రిలా అన్ని విధాల తనకు అండగా ఉంటున్న అన్న రమేష్ బాబు మరణం మహేష్‌ను కూడా ఎంతో బాధ పెట్టింది. ఆ బాధ నుంచి కోలుకోక ముందే మహేష్‌బాబు ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహేష్ తల్లి ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28న మృతి చెందారు. 2019 విజయనిర్మల మృతితో కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ బాధ నుంచి బయటపడక ముందే ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణం, ఆ తర్వాత మొదటి భార్య ఇంద్రరా దేవి మరణం కూడా కృష్ణాను తీవ్రంగా కృంగదీసింది.
ఏదేమైనప్పటికీ ఓకే ఏడాదిలో 8 నెలల వ్యవధిలోనే ఏకంగా ముగ్గురు మృతిచెందడం మహేష్ బాబు కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోఖాన్ని మిగిల్చింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతిచెందడం ఘట్టమనేని కుటుంబానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్‌గా మారింది. మహేష్ బాబు ఈ విషాదాల నుంచి త్వరగా కోలుకోవాలని మానసికంగా దృఢంగా నిలబడాలని సినీ ప్రముఖులతో పాటు ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…