Koratala Siva : రచయిత నుండి దర్శకుడిగా మారి హిట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఆచార్య పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కొరటాల శివ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ.. తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఈ సూపర్ హిట్ కాంబోలో మూవీ రాబోతుంది. వీలైనంత తొందరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే నెలలో ఎన్టీఆర్ మినహా.. మిగతా షూటింగ్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఆ తర్వాత మిగిలిన షూటింగ్ చేయనున్నారట. అయితే కొరటాల నుండి త్వరలో ఓ మల్టీ స్టారర్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.
బాలకృష్ణ, మహేష్ బాబులతో కొరటాల శివ ఓ మల్టీ స్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ.
అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఇది పూర్తైన వెంటనే బాలకృష్ణ – కొరటాల చిత్రం పట్టాలెక్కనుందని, ఇందులో మహేష్ బాబు కూడా కనిపించనున్నారని సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…