Koratala Siva : సినిమా ఇండస్ట్రీ అంటే.. అంతే.. అందులో ఏ విభాగంలో అయినా ఉండవచ్చు. కానీ నిర్మాణ రంగం వైపుకు మాత్రం వెళ్లకూడదు. ఎందుకంటే ఇతర విభాగాల్లో వచ్చిన అనుభవంతో నిర్మాణ రంగం అంటే ఏమిటో అప్పటికే తెలిసి వస్తుంది. కనుక వేరే విభాగాల్లో ఉన్నవారు ఎవరూ కూడా సినిమాను నిర్మించేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. సినిమా రంగంలోని తమ విభాగంలోని పనిని తాము చేసుకుపోతుంటారు. ఎవరో పేరుగాంచిన హీరోలు అయితే తప్ప సహజంగా ఎవరూ నిర్మాతగా మారరు. కానీ ఆ దర్శకుడు మాత్రం నిర్మాతగా మారి తప్పు చేశారని తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా ? కొరటాల శివ. అవును.. ఈయనే.. ఇంతకీ ఈయన ఏం సినిమా చేశారు.. అనే కదా మీ డౌట్. అయితే అందుకు సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి కొరటాల శివ ఆచార్య మూవీ చేశారు కదా. అవును.. దీనికే ఆయన నిర్మాతగా కూడా ఉన్నారు. అవును.. ఇది నిజమే. ఆచార్య సినిమాను మొదట మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించేందుకు పూనుకుంది. కానీ సినిమా చాలా ఆలస్యం అవుతుండడం, బడ్జెట్ పెరిగిపోతుండడంతో వారు నష్టం వస్తుందని అంచనా వేసి ముందుగానే సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే తాను ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. అదే నమ్మకంతో కొరటాల శివ ఆచార్యకు నిర్మాతగా ఉన్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు డబ్బును సెటిల్ చేసి ఈ మూవీలో ఆయన కొంత వాటా తీసుకున్నారు. అయితే అదే ఆయన కొంప ముంచింది. ఎందుకంటే ఆచార్య ఫ్లాప్ అయింది.
అలా ఆచార్య మూవీ ఫ్లాప్ కావడంతో కొరటాలకు తీవ్రంగా నష్టం వచ్చిందట. కనుకనే ఆయన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బును సెటిల్ చేశారు. అయితే మొత్తం సెటిల్ చేసేందుకు ఇంకా రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉండడంతో గత్యంతరం లేక కొరటాల తన ప్రాపర్టీల్లో ఒకదాన్ని అమ్మేశారట. అలా కొరటాలకు కూడా ఆచార్య తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది. అయితే ఇప్పుడు ఎన్‌టీఆర్ 30వ సినిమాతో ఆయన ధీమాగా ఉన్నారు. కనీసం ఈ మూవీ అయినా హిట్ అయి లాభాలను తెచ్చి పెడితే అప్పుడు పోయిన డబ్బులు తిరిగి వస్తాయని ఈయన నమ్మకం. మరి కొరటాల ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…