Kondapolam : మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈ నెల 1వ తేదీన విడుదల అయిన విషయం విదితమే. ఈ మూవీకి చక్కని రివ్యూలు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.
ఇక సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మూవీ కొండపొలం పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కొండపొలం మూవీ గత వారం విడుదల కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో జనాలు అసలు కనిపించడం లేదు. ఆక్యుపెన్సీ సాధించడమే కష్టంగా మారింది.
రిపబ్లిక్ మూవీకి థియేటర్లలో వచ్చిన ఆక్యుపెన్సీలో సగం స్థాయిని కూడా కొండపొలం మూవీ అందుకోలేకపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొండపొలం మూవీకి నిజానికి విమర్శకుల నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. అయిప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టడం లేదు.
అయితే ఈ రెండు సినిమాల జోనర్ ఒక్కటే. సీరియస్‌నెస్‌తోపాటు సమాజానికి సందేశాన్ని ఇచ్చే మూవీలు. కనుక ప్రేక్షకులకు ఈ జోనర్‌లు ఇప్పుడు అంతగా నచ్చడం లేదని స్పష్టమైంది. వారు ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకుంటున్నారని తెలుస్తోంది.