Kodali Nani : గత కొద్ది రోజులుగా ఏపీలో సినిమా థియేటర్స్‌పై దాడులు, సీజ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మరో వైపు టిక్కెట్ రేట్స్ కూడా భారీగా తగ్గించడంతో టాలీవుడ్ ప్రముఖులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. థియేటర్లకు వచ్చే కలెక్షన్ల కంటే కిరాణా షాపులకు వచ్చే కలెక్షన్లే ఎక్కువని నాని అన్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పాడు.
టిక్కెట్ రేట్స్ పెంచడం అంటే ప్రేక్షకులని అవమానించడమేనని నాని సంచలన కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని కూడా హీరో నాని వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కిరాణా కొట్టుకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినపుడు సినిమా వాళ్లు తమ పెట్టుబడులను కిరాణా కొట్లలో పెట్టుకోవచ్చు కదా ? అంటూ సెటైర్లు వేశారు.
సినిమా టికెట్ ధరలను తమ ప్రభుత్వం తగ్గించలేదని ఆయన అన్నారు. కొన్ని సినిమాలకు రేట్లు పెంచమని గతంలో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునేవారని.. అలాంటి పరిస్థితి ఉండకూడదనే తమ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పారు.
తాము టికెట్ ధరలను తగ్గించలేదని అన్నారు. టికెట్ ధరలు తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టమని అంటున్నారని.. ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…