Venkatesh : చంటి సినిమాకు వెంక‌టేష్ కాకుండా మొద‌ట ఏ హీరోని అనుకున్నారో తెలుసా?

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్‌లో మంచి హిట్ కొట్టిన చిత్రం చంటి. దర్శకుడు రవిరాజా పినిశెట్టి తమిళంలో ఘన విజయం సాధించిన చిన తంబిని చూశారు. ఆ చిత్రం రాజేంద్ర ప్రసాద్‌‌తో చేయాలనుకున్నారు. అదే సమయంలో రామానాయుడు, సురేష్, వెంకటేష్‌లు కూడా చినతంబిని చూసి వెంకటేష్‌తో తీయమని రవిరాజాను అడిగారు. కానీ అప్పటికే రాజేంద్రప్రసాద్‌కు మాట ఇచ్చి ఉండడం వల్ల‌ వెంకటేష్‌తో చేయలేనని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకుందామనుకున్నారు రవిరాజా.

Venkatesh

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఛేంజ్ చేసిన చిత్రాల్లో చంటి ఒకటి. అప్పటికే బొబ్బిలి రాజా లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వెంకటేష్.. వెంటనే చంటితో రికార్డులు తిరగరాశారు. చంటి చిత్రం సంచలన విజయం సాధించి వెంకటేష్‌కు తిరుగులేని ఫ్యామిలీ ఇమేజ్ ను తీసుకొచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మీనా, నాజర్‌, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

1992 జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులు సాధించింది. చంటి సినిమాలో వెంకటేష్.. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇప్పటికీ చంటి అంటే వెంటనే వెంకీ ఫేస్ గుర్తుకొస్తుంది. అయితే ఈ చిత్రం వెనక అసలు నిజాలు చాలానే ఉన్నాయి.

ముందు ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నపుడు దర్శకుడు, నిర్మాత బుర్రలో అస్సలు వెంకటేష్ లేడు. చిరంజీవి మీడియేటర్‌గా వ్యవహరించి వెంకటేష్‌తో చంటి సినిమా చేయడానికి రవిరాజాను ఒప్పించారు. హీరోయిన్ పాత్రకు తమిళంలో చిన్నతంబిలో చేసిన ఖుష్బూనే తీసుకుందామనుకున్నారు. కానీ ఆమె మళ్లీ అదే పాత్రను తెలుగులో చేయనని చెప్పింది. దాంతో దర్శక నిర్మాతలు మీనాను సంప్రదించారు. ఆమె ఓకే చేయడంతో సినిమా పట్టాలెక్కింది.

1992 జనవరి 10న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో వెంకటేశ్ నటన అందరినీ ఆకట్టుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయఢంకా మోగించింది. ఇళయ‌రాజా సంగీతం ఈ సినిమాకు మరో కలిసొచ్చిన అంశం. ఎన్నెన్నో అందాలు, పావురానికి పంజరానికి పెళ్లి చేసెసే పాడు లోకం, అన్నుల మిన్నుల.. ఇలా అన్ని పాటలూ సంగీత ప్రియులను అలరించాయి. ఈ చిత్రం కన్నడ, హిందీలోనూ విడుదలై విజయఢంకా మోగించింది. అయితే హిందీలో అనారిగా వచ్చిన చంటి చిత్రంలోనూ హీరోగా వెంకటేష్‌నే ఎంపిక చేయడం గమనార్హం.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM