Khushboo : ప్రస్తుత తరుణంలో హీరోయిన్లు తమ అందానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంగా కనిపించడం కోసం అనేక రకాల పనులు చేస్తున్నారు. అయితే కుర్ర హీరోయిన్ల సంగతి పక్కన పెడితే.. సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు అందానికి తెగ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఓ వైపు వయస్సు మీద పడుతున్నా.. అందం తగ్గకుండా చూసుకుంటున్నారు. అందుకుగాను అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ఇక అలాంటి హీరోయిన్ల జాబితాలో ఖుష్బు ఒకరు. ఈమె ప్రస్తుతం సినిమాల్లో తల్లి, అత్త, అక్క క్యారెక్టర్స్ చేస్తోంది. కానీ బొద్దుగా ఉండే ఈమె సన్నగా మారింది. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఖుష్బు ఉత్తరాదిలో జన్మించారు. అయినప్పటికీ ఈమె తెలుగు, తమిళం సినిమాల్లో ఎక్కువగా నటించారు. తెలుగులో అయితే వెంకటేష్, నాగార్జున పక్కన ఎక్కువ సినిమాల్లో నటించారు. ఇక ప్రస్తుతం ఈమె సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ఖుష్బు బాగా బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు సన్నగా మారింది. ఈ క్రమంలోనే ఆమె తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఆమెను చూసి అందరూ షాకవుతున్నారు. ఖుష్బు ఏంటి.. ఇలా గుర్తు పట్టరాకుండా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

ఖుష్బు తమిళ దర్శకుడు సుందర్‌ని వివాహం చేసుకున్నారు. అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఇక తన బరువుపై దృష్టి పెట్టిన ఈమె ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.