Khiladi Movie : మాస్ మహారాజ రవితేజ సినిమాల్లో మనకు ఎప్పుడూ లిక్ లాక్ సీన్లలో దాదాపుగా కనిపించలేదు. లవ్ అంశంతో కూడిన సినిమాల్లో ఆయన అప్పట్లో నటించారు. అయితే వాటిల్లోనూ ప్రేక్షకులకు చూపించే విధంగా లిప్ లాక్ సీన్లు ఏవీ లేవు. కానీ చూస్తుంటే ఆయన కుర్ర హీరోలా మారినట్లు అర్థమవుతోంది. ఆయన కూడా హీరోయిన్లతో లిప్‌లాక్ లకు రెడీ అంటున్నారు. తాజాగా ఆయన నటించిన ఖిలాడి సినిమాకు చెందిన ఓ సీన్ నెట్‌లో లీకైంది. అందులో ఆయన లిప్ లాక్ చేసిన సన్నివేశం ఉంది.

రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాలోని ఓ సన్నివేశం ఆన్‌లైన్‌లో లీకైంది. అందులో డింపుల్ హయతికి రవితేజ లిప్‌లాక్ ఇస్తున్న సీన్ ఒకటి ఉంది. అది వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే రవితేజ లిప్‌లాక్ సీన్లలో నటిస్తుండడాన్ని చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
ఇక ఈ మూవీలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు స్పష్టమవుతుండగా.. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు లిప్‌లాక్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో అనసూయ కీలకపాత్రలో నటిస్తోంది. ఆమె ఒక హీరోయిన్‌కు అత్తగా.. రవితేజకు తల్లిగా.. చంద్రకళ అనే పాత్రలో నటించిందని సమాచారం. ఈ మూవీకి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా విడుదలకు ముందే భారీ ఎత్తున బిజినెస్ చేసిందని తెలిసింది. దీంతో నిర్మాత సత్యనారాయణ.. దర్శకుడు రమేష్ వర్మకు ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.