Keerthy Suresh : మ‌హేష్ బాబుపై చేయి చేసుకున్న కీర్తి సురేష్‌.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసా ?

Keerthy Suresh : సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం​ సర్కారు వారి పాట. చాలా రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకొని మే 12న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్‌ చేస్తోన్న ఈ సినిమా యూనిట్ ప్ర‌మోష‌న్స్ జోరు పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో మూవీ టీం బిజీ అయ్యింది. తాజాగా కీర్తి సురేష్‌ ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకుంది.

Keerthy Suresh

షూటింగ్ సమయంలో తాను టైమింగ్ కోల్పోయి.. స్టెప్పులు మర్చిపోయి.. రెండు సార్లు మిస్ టైమింగ్ తో మహేష్ ను కొట్టినట్లు కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అయితే మూడో సారి దానికి సారీ చెప్పానని.. అయితే మూడోసారి కూడా పొరపాటున కొట్టినట్లు చెప్పింది. దీని తర్వాత నాపై కోపం ఏమైనా ఉందా ? అని మహేశ్ సరదాగా అడిగారని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. మ‌హేష్ షూటింగ్‌లో చాలా స‌ర‌దాగా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. త‌న తోటి ఆర్టిస్టుల‌తో జోకులు చేస్తూ స‌ర‌దాగా షూటింగ్ లో పాల్గొంటారు.

హాఫ్‌ స్క్రీన్‌లో మహేశ్‌ బాబు కామెడీ టైమింగ్‌ ఎలా ఉంటుందని కీర్తి సురేష్‌ని అడగ్గా.. ఆయనతో షూటింగ్‌ చాలా సరదాగా ఉంటుందని కీర్తి సురేష్‌ పేర్కొంది. సర్కారు వారి పాట మూవీపై పూర్తి పాజిటివ్ బజ్ నడుస్తోంది. అదే సమయంలో మహేష్ ఫ్యాన్స్ ని మరో భయం వెంటాడుతుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న మహేష్ కి కీర్తి సురేష్ కారణంగా ప్లాప్ పడితే పరిస్థితి ఏమిటంటూ ఆందోళన చెందుతున్నారు. ప్లాప్స్ లో ఉన్న కీర్తి తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మహేష్ కి కూడా ప్లాప్ ఇస్తుందేమోనని కంగారు పడుతున్నారు. మ‌రోవైపు మే నెల‌లో విడుదలైన‌ మ‌హేష్ సినిమాలు ఫ్లాపుల‌ బాట ప‌ట్టగా, ఇది కూడా అభిమానుల‌ని క‌ల‌వ‌ర పెడుతోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM