Katrina Kaif : బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ కొన్నాళ్లుగా సీక్రెట్ లవ్ వ్యవహారం నడిపిస్తూ వస్తున్నారు. కలిసి పార్టీలకు వెళ్లడం, అప్పుడప్పుడూ కలుసుకోవడం ఆ సమయంలో కెమెరాలకు చిక్కడం వంటివి జరిగింది. ఎట్టకేలకు ఈ జంట పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ వేదిక కానుందట.
తమ జీవితాల్లో ఎంతో కీలకమైన ఈ రోజుని కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని వీరిద్దరూ భావించారట. అందుకని తమ పెళ్లి వేడుకకు వచ్చే వారికి కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ జోడీ ఓ రిక్వెస్ట్ పెట్టిందని తెలుస్తోంది. పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ కావడం తమకు ఇష్టం లేదని.. అందుచేత ఈ పెళ్లికి ఎవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని కత్రినా, విక్కీ కోరినట్లు తెలుస్తోంది.
ఫంక్షన్‌ని ఏర్పాటు చేస్తోన్న ఆర్గనైజర్స్‌కి సైతం ఈ విషయంపై రూల్ పాస్ చేశారట. మరోవైపు శుభకార్యం దగ్గరపడుతోన్న తరుణంలో ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ జంట గత కొన్నిరోజుల నుంచి పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారట. ఇంతకు ముందు రణ్వీర్ సింగ్, దీపికా జంట కూడా ఇలాగే పెళ్లి ఫొటోలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కత్రినా, విక్కీల వివాహ వేడుకకు ఇండస్ట్రీ నుండి ఎవరెవరు హాజరవుతారు.. అనేది ఆసక్తికరంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…