Karthika Deepam : బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకూ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో.. నిజం తెలిసిన దీప సంతోషంగా ఉంటూ ఎంతో బాధపడుతుంది. ఇక దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సమయంలో.. సౌందర్యకి మోనిత ఫోన్ చేసి.. బాబుకి బాగాలేదు, కార్తీక్ ని పంపించమని అడుగుతుంది. ఆ సమయంలో కార్తీక్.. దీప జాగ్రత్త.. చీర అంటుకుంటుందనే.. మాటలు విన్న మోనిత కోపంతో రగిలిపోతూ ప్రియమణి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా దీపావళి జరుపుకుంటుండగా సౌందర్య, కార్తీక్, ఆనందరావు.. దీప చివరి నిర్ణయం అంటూ మాట్లాడుతుంది.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. అంటూ బాధపడతారు. ఇక టపాకాయలు కాల్చి పిల్లలతో సరదాగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిన దీపతో.. నీ జోకులు ఆపమ్మా.. నవ్వలేకపోతున్నాను అంటూ పిల్లలు సరదాగా మాట్లాడుతారు.
నాన్న.. ఈరోజు అమ్మ పుట్టిన రోజు.. తనకు గిఫ్ట్ ఇచ్చావా అని పిల్లలు అడగడంతో.. వెంటనే దీప.. మీ నాన్న ఎప్పుడో పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు.. అని చెబుతుంది. ఆ మాటకు సౌందర్య, కార్తీక్ బాధపడతారు.
వీళ్ళు అందరూ ఇలా మాట్లాడుతుండగా అదే సమయంలో కార్తీక్ ఇంటికి మోనిత రావడంతో అందరూ షాక్ అవుతారు. మోనితను చూసిన కార్తీక్ తనని బయటకు వెళ్ళమని అరవగా.. దీప మాట్లాడుతూ.. ఇంటికి వచ్చిన వారితో ఇలాగేనా మాట్లాడటం డాక్టర్ బాబు.. అంటుంది.
దీప మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మోనిత తన కొడుకు బారసాలకు రావాలని ఆహ్వానించడంతో అందుకు కార్తీక్ కుటుంబం ఒప్పుకోదు. అయితే దీప మాట్లాడుతూ నువ్వు వెళ్లి బారసాల ఏర్పాట్లు చేసుకో.. వీళ్లందరినీ తీసుకువచ్చే బాధ్యత నాది.. అంటూ హామీ ఇస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
అసలు సిసలైన ట్విస్ట్ రేపిస్తా అంటూ మోనితకి దీప చెప్పడంతో ఆమె కంగారు పడుతుంది. అయితే రేపటి ఎపిసోడ్ లో దీప తన కుటుంబ సభ్యులకు ఎలాంటి షాక్ ఇవ్వబోతుందో.. తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…