Karate Kalyani : నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల మధ్య జరిగిన గొడవ ఊహంచని మలుపు తిరిగి అది ఆమె మీదకే రివర్స్ అయిన విషయం విదితమే. ఆమె ఓ కుటుంబానికి చెందిన పసిపాపను దత్తత తీసుకోకుండానే పెంచుకుంటుందన్న విషయంలో ఆమెపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులతోపాటు కల్యాణి అధికారుల ఎదుట విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే అన్ని వివరాలను పరిశీలించిన అధికారులు కల్యాణికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు.
ఇక అధికారుల ఎదుట విచారణకు హాజరైన కల్యాణి పాపను దత్తత ఇంకా తీసుకోలేదని తెలియజేయగా.. వారు ఆ పాపను ఆ తల్లిదండ్రులకు అప్పగించేశారు. పాపను దత్తత తీసుకోవాలంటే చట్ట ప్రకారం అన్ని పత్రాలతో ఆ పని చేయాలని.. ఇలా పత్రాలు లేకుండా దత్తత తీసుకోవద్దని.. అధికారులు ఆమెకు సూచించారు. అయితే ఆ పాప తల్లిదండ్రులు కూడా కల్యాణి వెంటే ఉన్నారు. లేదంటే కేసులో ఆమె ఈ పాటికి జైలులో ఊచలు లెక్కబెడుతుండేది.
ఇక అధికారుల విచారణ అనంతరం పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను పాపను లీగల్‌గానే దత్తత తీసుకుంటానని స్పష్టం చేసింది. తనపై కొందరు కావాలనే బురదజల్లే యత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయ కోణంలోనే తనపై కొందరు తప్పుడు కేసులు పెట్టించారని.. అయితే నిజా నిజాలు ఏమిటో నిగ్గు తేలుస్తానని.. తనను ఇబ్బందులకు గురి చేసిన వారిని విడిచి పెట్టబోనని కల్యాణి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆమె హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటోంది. అయితే ముందు ముందు ఈ విషయంలో ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…