Kanipakam Temple : మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజు మనం సర్వవిఘ్నాలను హరించే కాణిపాకం వినాయకుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి..? అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాణిపాకంలో వినాయకున్ని ఎవరు ప్రతిష్టించలేదు. ఆయన అక్కడ స్వయంభువుగా వెలిశాడని చరిత్ర చెబుతోంది. అందులో భాగంగానే ఓ కథ కూడా అక్కడ ప్రచార్యంలో ఉంది. ఒకానొక కాలంలో ఒక గ్రామంలో మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వ్యవసాయం జీవనం గడిపేవారు. వారి వ్యవసాయ భూమిలో ఎప్పుడూ పంటలు బాగా పండేవి.
అయితే ఒకసారి వారి వ్యవసాయ భూమిలో ఉండే బావిలో నీరు ఎండిపోతుండడాన్ని వారు గమనించారు. దీంతో వారు ఆ బావిని కొంత లోతు తవ్వితే నీరు వస్తుందని భావించి వెంటనే ఆ బావిని తవ్వడం మొదలు పెట్టారు. అలా వారు కొంత లోతు తవ్వగానే ఓ రాయి తగిలింది. వెంటనే ఆ బావినిండా రక్తం ఊరటం మొదలయ్యింది. అలా క్రమ క్రమంగా ఆ బావి మొత్తం రక్తంతో నిండిపోయింది. అయితే అదే సమయంలో ఆ అన్నదమ్ములకు బావిలో వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. దీంతో వారు తవ్వడం ఆపి విగ్రహాన్ని పూజిస్తారు. ఈ క్రమంలో వెంటనే వారికి ఉన్న వైకల్యాలు పోయి వారు మామూలు మనుషులుగా మారుతారు. అలా ఆ విషయం ఆ నోట ఈ నోట ఆ గ్రామంలోని ఇతర ప్రజలందరికీ తెలుస్తుంది.
దీంతో వారు కూడా వినాయకున్ని పూజించడం మొదలు పెడతారు. ఈ క్రమంలోనే వారు స్వామివారికి కొట్టే కొబ్బరికాయల నుంచి వచ్చే నీరు ఆ గ్రామం అంతా వ్యాపిస్తుంది. దీంతో వారి పంటలు పచ్చగా పండుతాయి. గ్రామం సకల సంపదలతో సుభిక్షంగా మారుతుంది. అలా వ్యవసాయ భూముల్లో నీరు ప్రవహించే సరికి ఆ గ్రామానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా కాణిపాకంలో వినాయకుడి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. స్వామివారి విగ్రహం రోజూ కొంత పరిమాణం పెరుగుతుంది. అందుకు సాక్ష్యం ఆయనకు ధరించే తొడుగులే. ఒకప్పుడు భక్తులు ఆయన విగ్రహానికి చేయించిన తొడుగులు ఇప్పుడు సరిపోవడం లేదు. విగ్రహం సైజు కాలక్రమేనా పెరిగింది. వెండి తొడుగులు ఆయన విగ్రహం పెరుగుతుందనడానికి సాక్ష్యాలు అని అక్కడ పండితులు వెల్లడిస్తున్నారు.
కాణిపాకంలో వినాయకుడి విగ్రహం బావిలోనే ఉంటుంది. అయితే ఆ బావిలోని నీరు ఎప్పటికీ కూడా ఎండిపోదు. దీంతో ఆ బావి నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా తీసుకుంటారు. చాలామంది తప్పులు చేసినవారిని కాణిపాకం తీసుకువచ్చి ఆలయం ఎదుట ఉన్న కోనేట్లో స్నానం చేయిస్తే వారు తాము చేసిన తప్పులను ఒప్పుకుంటారని భక్తుల నమ్మకం. అలాగే కాణిపాకం ఆలయంలో ఎప్పుడూ ఒక పాము తిరుగుతుంటుందట. అది ఎవరికీ అపకారం చేయదని, అది దేవతా సర్పమని వచ్చే కాణిపాకం వచ్చే భక్తులు నమ్ముతారు. ఇంత విశిష్టత కలిగిన కాణిపాక విఘ్నేశ్వరుని ఒకసారి దర్శిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…