Kangana Ranaut : కంగనా రనౌత్.. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో సుశాంత్ సింగ్ మరణంపై ఈమె బాలీవుడ్ మొత్తాన్ని విమర్శించింది. బంధుప్రీతి ఎక్కువని, కష్టపడి పైకి ఎదిగే వారిని తొక్కేస్తారని ఘాటు విమర్శలు చేసింది. అయితే కంగనా వ్యవహార శైలి చూస్తే ఆమె పరోక్షంగా బీజేపీ ప్రభుత్వానికి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంటుంది.
కంగనా ఇటీవలే నాలుగోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకోవడంతోపాటు రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆమె పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకుంది. ఇక తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె తన మనస్సులో ఉన్న విషయాలను మీడియతో షేర్ చేసుకుంది.
తాను ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో కష్టాలు పడ్డానని కంగనా చెప్పుకొచ్చింది. తనకు విజయం సాధించేందుకు 8-9 ఏళ్లు పట్టిందని, అయినా విడిచిపెట్టలేదని స్పష్టం చేసింది. ఇక నటిగా తాను ఎంతో సాధించానని చెప్పిన కంగన.. పెళ్లిపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, వైవాహిక జీవితాన్ని గడపాలని, పిల్లల్ని కనాలని ఉందని కూడా చెప్పింది. అయితే తనకు కాబోయే భర్త గురించి మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తానని చెప్పింది. మరి ఆ లక్కీ మ్యాన్ ఎవరో తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…