Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈమె ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. అది వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పటి నుంచి ఈమె బాలీవుడ్ పై అవకాశం లభించినప్పుడల్లా విమర్శలు చేస్తూనే వస్తోంది. అందులో భాగంగానే కంగనా తాజాగా మరోమారు బాలీవుడ్‌పై రెచ్చిపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోలకు చెందిన పిల్లలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ లో పలువురు హీరోలకు చెందిన పిల్లలు త్వరలో సినిమాల్లో నటించనున్న విషయం విదితమే. అయితే కొందరు ఇప్పటికే సినిమాలు చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై స్పందించిన కంగనా వారిపై విమర్శలు చేసింది. సౌత్ ఇండియాకు చెందిన హీరోలు తమ ఫ్యాన్స్‌తో సరిగ్గా కనెక్ట్ అవుతారు. అసలు వాళ్లు ఫ్యాన్స్ కాదు.. అంతకన్నా ఎక్కువే. అయితే ఇలాంటి పరిస్థితి బాలీవుడ్‌లో ఉండదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోలకు చెందిన పిల్లలు ఇక్కడ చదవరు. విదేశాల్లో చదువుతారు. హాలీవుడ్ మూవీస్ చూస్తారు.

వారు భోజనాన్ని కూడా చేత్తో చేయరు. అందుకు స్పూన్ వాడరు. అలాంటప్పుడు వారు ఇక్కడి ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతారు. ఇక్కడి వారికి కనెక్ట్ అవ్వాలంటే.. ఇక్కడి పద్ధతులను ఫాలో అవ్వాలి. అలాంటి విషయాల్లో సౌత్ హీరోలు ముందుంటారు. వారికి, బాలీవుడ్‌కు పోలిక లేదు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు చూసేందుకు కూడా అంత బాగా ఏమీ అనిపించరు. వారు ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు. ఇంక అంతకన్నా చెప్పేది ఏముంటుంది ?.. అని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.