Kangana Ranaut : ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే గతంలో ఈమె పలు వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ కంగనా తన పంథాను మార్చుకోవడం లేదు. తాను నమ్మిన విషయాలను బలంగా బల్ల గుద్ది మరీ చెబుతుంది. అందుకు ఆమెను ఎవరు ఏమన్నా అస్సలు పట్టించుకోదు. ఇక తాజాగా ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది.

దీపికా పదుకొనె, అనన్య పాండే హీరోయిన్లుగా నటించిన చిత్రం.. గెహ్రాయియా.. ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో దీపికా ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసింది. అలాగే ఘాటు సీన్లలోనూ నటించింది. దీంతో ఈ చిత్రంపై కంగనా వ్యాఖ్యలు చేసింది.
తాను ఈ తరానికి చెందిన వ్యక్తినే అని కంగనా తెలిపింది. అయితే ఇలాంటి రొమాన్స్ తనకు అర్థం అవుతుందని, ఇది ఒక చెత్త సినిమా అని, దీన్ని అమ్మకానికి పెట్టొద్దని, దీంతో యువత చెడిపోతుందని.. కంగనా కామెంట్స్ చేసింది. అలాగే చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయని, అలాంటి మూవీలను స్కిన్ షోలు, అశ్లీలత ఏమాత్రం కాపాడలేవని కంగనా పేర్కొంది. దీంతో ఈమె చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే కంగనా కామెంట్లపై అటు గెహ్రాయియా చిత్ర యూనిట్ కానీ.. దీపికా పదుకొనే గానీ స్పందించలేదు.