Kalyaan Dhev : చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన విజేత సినిమాలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తరువాత సూపర్ మచ్చి అనే సినిమా చేశాడు. కానీ ఇది కూడా ఆలస్యంగా విడుదలై ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక కల్యాణ్ తరువాత కిన్నెరసాని అనే మరో మూవీ చేశాడు. అయితే ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే త్వరలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే థియేటర్లలో మాత్రం కాదు.. ఓటీటీలో. జీ5 యాప్‌లో ఈ మూవీని నేరుగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
అయితే శ్రీజతో విడిగా ఉంటున్నాడన్న కారణమో.. లేక మెగాఫ్యామిలీకి దూరం అయ్యాడన్న కారణమో తెలియదు కానీ.. గతంలో కల్యాణ్ దేవ్‌ను తమ మనిషి అనుకున్న మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఆయనను దూరం పెట్టేశారు. శ్రీజ, కల్యాణ్ దేవ్ విడిపోయారని వార్తలు వస్తుండడం.. మరోవైపు మెగా ఫ్యామిలీ వేడుకల్లో ఎక్కడా కల్యాణ్ కనిపించకపోవడం.. ఆయన సినిమాలను మెగా ఫ్యామిలీ పట్టించుకోకపోవడంతో.. ప్రేక్షకులు కూడా కల్యాణ్‌ను లైట్ తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. లేదంటే శ్రీజతో కలసి ఉండి ఉంటే ఆయన సినిమాను తప్పక థియేటర్లలో రిలీజ్ చేసి ఉండేవారని అర్థం చేసుకోవచ్చు. అంటే.. వారు విడిపోయారని ఈ మూవీతో మరోమారు స్పష్టమవుతోంది. అయితే దీనిపై వారు ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే కల్యాణ్ దేవ్‌ను మాత్రం ప్రస్తుతం పట్టించుకునే వారే కరువయ్యారు. ఆయనను లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక కిన్నెర సాని మూవీని జీ5 లో ఈ నెల 10న రిలీజ్ చేయనున్నారు. దీన్ని అశ్వత్థామ దర్శకుడు రమణ తేజ తెరకెక్కించగా.. పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మించారు. ఇందులో మళయాళ భామ షీతల్ హీరోయిన్ గా నటించింది. రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రలో నటించారు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…