Jr NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టుకొని ఇండస్ట్రీలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళ వయస్సులోనే ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ కి ఎదురైనా ఒక చేదు అనుభవం వింటే షాక్ అవుతారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్స్, నిర్మాతలు క్యూ కట్టేవారు.
అయితే అప్పట్లో ఎన్టీఆర్ కి ఎంతో సన్నిహితుడిగా ఉండే ఒక స్నేహితుడు ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గర ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి నీకు కాల్ షీట్స్ ఇప్పిస్తాను అని చెప్పి అతని దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నాడట.. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఆంధ్రావాలా, సాంబ, నరసింహుడు, నా అల్లుడు ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ మాకు మాత్రం సినిమా చేసి పెట్టడం లేదు అంటూ నేరుగా ఎన్టీఆర్ వద్దకే వెళ్లారట ఆ నిర్మాతలు. మా దగ్గర అంత అడ్వాన్స్ డబ్బులు తీసుకొని మా సినిమా చెయ్యవా.. నిన్ను నమ్మి అమ్ము చేసి డబ్బు తెచ్చి అడ్వాన్స్ గా నీకు ఇచ్చాము. వాటికి వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాము. నువ్వు మాత్రం మాకు కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పి ఇవ్వడం లేదు అని ఎన్టీఆర్ ని నిలదీసాడట.
అప్పుడు ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్ అయ్యి నేనెప్పుడూ మీకు కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పాను అన్నాడట. అప్పుడు ఆ నిర్మాత నీ స్నేహితుడు నీ కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పి మా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు. నువ్వేమో ఏమి తేలినట్టు మాట్లాడుతున్నావ్ అని మండిపడ్డాడట. అప్పుడు ఎన్టీఆర్ ఈ విషయం నాకు తెలీదు మీకు కచ్చితంగా నా నెక్స్ట్ మూవీకి డేట్లు ఇస్తాను అని చెప్పాడట. కానీ ఆ నిర్మాత ఒప్పుకోకపోవడంతో ఎన్టీఆర్ తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పోగు చేసి ఆ నిర్మాతకి సెటిల్ చేసి పంపాడట. నమ్మి చేరదీస్తే ఇంత మోసం చేస్తావా అంటూ ఎన్టీఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ ని బాగా మందలించి దూరం పెట్టేసాడట. ఆ వ్యక్తి ఎవరు అన్నది ఎన్టీఆర్ సన్నిహితులకు మాత్రమే తెలుసట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…