Jio : భారత టెలికాం రంగంలో జియో నెట్‌వర్క్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జియో మరో కొత్త సంచలనానికి తెరతీయనుంది. అత్యంత చవక ధరకే ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. జియో ఫోన్ నెక్ట్స్ పేరిట ఆ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడీ ఫోన్ లాంచ్ తేదీని కన్‌ఫాం చేశారు.
జియో ఫోన్ నెక్ట్స్‌ను గత వినాయక చవితి రోజునే లాంచ్ చేయాల్సి ఉంది. కానీ చిప్ ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోన్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. అయితే గూగుల్ భాగస్వామ్యంతో ఈ ఫోన్‌ను జియో రూపొందించింది కనుక గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ ఫోన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్‌ను దీపావళి రోజున ఆవిష్కరిస్తామని కన్‌ఫాం చేశారు. కనుక దీపావళి రోజున యూజర్లు ఈ ఫోన్ కోసం రెడీగా ఉండాల్సిందే.
ఇక ఈ ఫోన్‌లో 5.5 ఇంచుల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ప్రగతి ఓఎస్ (ఆండ్రాయిడ్ ఆధారితం).. వంటి అద్భుతమైన ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ ఫోన్ ధర రూ.3499గా ఉండనున్నట్లు తెలుస్తోంది.