Jio Laptop : టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జియో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోనూ అడుగు పెట్టింది. జియో ఫోన్ పేరిట ఇప్పటికే పలు మోడల్స్ మార్కెట్‌లో విజయవంతంగా అమ్ముడవుతున్నాయి. అయితే త్వరలోనే జియో ల్యాప్‌టాప్ కూడా రిలీజ్ కానుంది. కేవలం రూ.15వేలకే దీన్ని అందించనున్నట్లు సమాచారం. ఇందులో 4జి సిమ్ వేసుకునే విధంగా స్లాట్‌ను ఇస్తారని తెలుస్తోంది. అందులో జియో సిమ్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తారని తెలుస్తోంది.
జియో అందించనున్న ల్యాప్‌టాప్‌ను భారత్‌లోనే స్థానికంగా తయారు చేయనున్నారు. ఇందుకు గాను క్వాల్‌కామ్‌తో జియో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. జియో తన 4జి ల్యాప్‌టాప్‌పై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మరో మూడు నెలలో ఈ ల్యాప్ టాప్‌ను లాంచ్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో హెచ్‌పీ, డెల్, లెనోవో కంపెనీలు ల్యాప్‌టాప్‌లను అందించడంలో టాప్ ప్లేస్‌లలో ఉన్నాయి. అయితే జియో తన 4జి ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేస్తే ఈ మార్కెట్ షేర్ మరో 15 శాతం మేర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో తన 4జి ల్యాప్‌టాప్‌ను ఈ నెలలోనే లాంచ్ చేస్తుందని సమాచారం.
జియో ల్యాప్‌టాప్‌లను ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌లో అందించి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారని తెలుస్తోంది. ఆ తరువాతే వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ ధర కేవలం రూ.15వేలుగా ఉంటుందని తెలుస్తోంది. దీని వల్ల ల్యాప్‌టాప్ రంగంలో జియో విప్లవాత్మకమైన మార్పును తెచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో జియో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందేని సమాచారం. ఇందులో జియో స్టోర్‌ను అందిస్తారని తెలుస్తోంది. అందులోనే యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కాగా వచ్చే మూడు నెలల్లో.. అంటే.. డిసెంబర్ చివరి నాటికి జియో ల్యాప్ టాప్‌లు రిలీజ్ అయినా.. వచ్చే ఏడాది వేసవి వరకు సుమారుగా 1 లక్ష ల్యాప్‌టాప్‌లను అమ్మడమే జియో లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. అయితే జియో 4జి ల్యాప్‌టాప్‌లు గనుక రిలీజ్ అయి నిజంగానే వినియోగదారులకు రూ.15వేలకు లభిస్తే.. అప్పుడు ల్యాప్‌టాప్ రంగంలో జియో సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. మరి అది నిజమవుతుందా.. లేదా.. అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…