Jeevitha : గరుడ వేగ సినిమా కోసం రూ. 26 కోట్లు ఎగ్గొట్టారని, దీనికి సంబంధించిన కేసులో జీవితకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని వచ్చిన నేపథ్యంలో జీవిత స్పందించింది. ఈ కేసు ఏడాది నుంచి నగరి కోర్టులో నడుస్తోంది. ఇంతకు ముందు కూడా నాపై వారెంట్ జారీ అయ్యింది. తాజాగా సమన్లు వచ్చిన మాట వాస్తవమే కానీ నేను అరెస్ట్ కాలేదు. ఈ కేసులో నేను గెలిచాను. వాళ్లు చేస్తున్న ఆరోపణలలో ఎంత మాత్రం వాస్తవం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అని పేర్కొంది.
మేము ఎలాంటి తప్పు చేయలేదు. కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెబుతాం. మాపై ఆరోపణలు చేసిన వారు చాలా తప్పులు చేశారు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.. అని జీవిత ప్రెస్‌మీట్‌లో భాగంగా వెల్లడించింది. నేను దాక్కో లేదని, తిరుగుతూనే ఉన్నానని అన్నారు. కోటేశ్వర రాజు మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, తామంటే నచ్చని వారెవరో వెనక ఉండి ఇలాంటి పనులు చేస్తుంటారని జీవిత చెప్పారు. ఓవర్ యాంబిషన్ కారణంగా కోటేశ్వరరాజు ఇలా ప్రవర్తిస్తున్నాడని అనిపిస్తోందని, ఆయన ఎవరి దగ్గరో చేసిన అప్పులను తమపై రుద్దాలని చూస్తున్నట్లుందని జీవిత పేర్కొన్నారు.
కొంతకాలంగా మీడియా ఎక్కువగా తమను టార్గెట్ చేస్తోందని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగినా కూడా జీవిత రాజశేఖర్‌ల విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారని, పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెడుతుంటారని వాపోయింది. మా కూతుళ్ల విషయంలోనూ అలాగే చూశారు. ఆ థంబ్ నెయిల్స్ చూసి ఎంతో మంది ఫోన్‌లు చేశారు.. వారు తిరుమలకు వెళ్తుంటే.. అలాంటి సమయంలోనే అలా రాశారు.. వాళ్ల పాటికి ఏదో వాళ్లకు వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ఉన్నారు.. అలా తప్పుడు థంబ్ నెయిల్స్ ఎందుకు పెడతారు అంటూ జీవిత రాజశేఖర్ ఎమోషనల్ అయింది.
ఇక రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమాకు దర్వకత్వం వహించింది జీవిత. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన జోసెఫ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…