Jabardasth : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షో చుట్టూ అనేక వివాదాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి రోజా వెళ్లిపోగా.. ఈ మధ్య కాలంలో పలువురు స్టార్ కమెడియన్లు కూడా దూరమయ్యారు. దీంతో జబర్దస్త్ కళ తప్పింది. అది చాలదన్నట్లు కొందరు కమెడియన్లు ఈ షోపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కిర్రాక్ ఆర్‌పీ, అప్పారావులు ఈ షో గురించి విమర్శలు చేశారు.
జబర్దస్త్ లో కనీసం మర్యాద ఇవ్వరని, భోజనం కూడా పెట్టరని.. అసలు విలువ ఇవ్వరని అప్పారావు, ఆర్‌పీలు తెలిపారు. నాగబాబు అందరికీ సహాయం చేసేవారని అన్నారు. అయితే ఇందుకు ఆది, రామ్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జబర్దస్త్‌లో ఆర్‌పీ చెప్పినట్లు ఏమీ జరగదని, వాస్తవానికి మల్లెమాల వారు తమకు ఎంతో సహాయం చేశారని అన్నారు. దీంతో అసలు ఎవరి మాటలను నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ ప్రొడక్షన్ మేనేజర్ ఏడుకొండలు సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోపై వస్తున్న అనేక వివాదాలపై ఏడుకొండలు మాట్లాడారు. జబర్దస్త్‌లో నాగబాబు కన్నా రోజాకే ఎక్కువ రెమ్యురేషన్ ఇచ్చామని వివరించారు. అందుకు కారణాలను కూడా ఆయన చెప్పారు. రోజా ఒక హీరోయిన్ అని, నాగబాబు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు అని.. ఆ కారణాల వల్లే రోజాకు ఎక్కువగా, నాగబాబుకు తక్కువగా రెమ్యునరేషన్ ను అందించామని అన్నారు. అయితే ఈ షోపై కొందరు చేస్తున్న విమర్శలు సరికాదని అన్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో గురించి రోజుకో కొత్త విషయం బయట పడుతుండడం సంచలనాలను కలిగిస్తోంది.