Jabardasth : బుల్లితెరపై అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌లతో దూసుకుపోతున్న షోలలో జబర్దస్త్ ఒకటి. కానీ నాగబాబు వెళ్లిపోయాక ఈ షోకు కాస్త కళ తప్పింది. అయినా సరే ఈ షోను ప్రేక్షకులు అలరించారు. అయితే ఇటీవలి కాలంలో పలువురు కమెడియన్లతోపాటు రోజా కూడా జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పారు. ఆమె మంత్రి అయ్యారు కనుక బిజీ షెడ్యూల్ ఉంటుంది. దీంతో టైమ్ కేటాయించలేరు. కనుకనే ఆమె జబర్దస్త్‌కు వీడ్కోలు పలికారు. అయితే అంతా బాగానే ఉంది.. కానీ ఈ షోకు పర్మినెంట్ మహిళా జడ్జిగా ఎవరిని పెట్టాలా.. అని నిర్వాహకులు ఆలోచిస్తున్నారట.
గతంలో ఇంద్రజ, ఆమని, సంఘవి, ఢీ పూర్ణ వంటి వారు మహిళా జడ్జిలుగా ఉన్నారు. అయితే వీరిలో కొందరికి షోలు చేయడం ఇష్టం లేదు. ఇక ఇంద్రజ ఇతర షోలతో ఇప్పటికే బిజీగా ఉన్నారు. కనుక జబర్దస్త్‌కు పూర్తి స్థాయిలో జడ్జిగా ఉండడం కుదరడం లేదు. కనుకనే పర్మినెంట్ మహిళా జడ్జి అయితే బాగుంటుందని టీమ్ ఆలోచిస్తున్నదట. ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ అని రెండు షోలు ఉన్నాయి. కానీ రెండు షోలకు జడ్జిలను అడ్జస్ట్ చేయడం వీలు కావడం లేదట. కనుక ఒక మహిళా జడ్జిని పర్మినెంట్‌గా తీసుకుంటే బాగుంటుందని టీమ్ అనుకుంటుందట. అందుకనే కొత్త నటి కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం.
అయితే జబర్దస్త్ రెండు షోలకు కూడా పర్మినెంట్ మహిళా జడ్జిగా నటి శ్రద్ధా దాస్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. ఆమె జడ్జిగా దాదాపు ఖరారు అయిందని సమాచారం. అదే నిజమైతే ఆమె గ్లామర్ తో షో రేటింగ్స్ ఎక్కడికో వెళ్తాయని చాలా సులభంగా చెప్పవచ్చు. శ్రద్ధా దాస్‌కు ప్రస్తుతం సినిమాల్లో ఆఫర్లు ఏమీ లేవు. కనుక ఆమె పూర్తి స్థాయిలో ఈ షోలకు పర్మినెంట్ జడ్జిగా చేసే అవకాశాలు ఉన్నాయి. కనుకనే ఆమెను నిర్వాహకులు సంప్రదించారని.. అందుకు ఆమె ఓకే చెప్పిందని కూడా తెలుస్తోంది. ఇక దీనిపై అధికారిక ప్రకటనను వెల్లడించడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు. దీంతో శ్రద్ధా దాస్ జబర్దస్త్ షోలకు జడ్జిగా వస్తుందని అంటున్నారు.
శ్రద్ధా దాస్‌కు ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ అమ్మడు చేసే గ్లామర్ ట్రీట్‌కు మతులు పోతుంటాయి. అందాల ఆరబోతనే లక్ష్యంగా ఈమె ఫొటోలు షేర్ చేస్తుంటుంది. జబర్దస్త్‌కు ఈమె గ్లామర్ తోడైతే.. షో మరింత పాపులర్ అవుతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే కష్టకాలంలో ఉన్న ఈ షోలకు ఇది ఎంతో కలసి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…