Jabardasth : జబర్దస్త్ షో అంటే ఒకప్పుడు ఇంటిల్లిపాదీ కూర్చుని ఎంతో సరదాగా నవ్వుకునేవారు. కానీ తరువాత పరిస్థితి మారిపోయింది. అందులో చేసే స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎక్కువయ్యాయి. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యారు. అయినా సరే రేటింగ్స్ ఏమాత్రం తగ్గకుండా ఈ షో కొనసాగింది. తరువాత ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను కూడా మొదలుపెట్టారు. ఇది కూడా బంపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. జడ్జిలు లేరు.. కమెడియన్లు లేరు. దీంతో ఈ షో కళ తప్పింది. అయితే త్వరలోనే ఈ షోకు భారీ ఝలక్ తగలనున్నట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ షోలో ఎంతో సుదీర్ఘకాలం నుంచి ఉన్న కమెడియన్లు సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోయారు. తరువాత హైపర్ ఆది కూడా ఈ షోకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. దీంతో స్టార్ కమెడియన్లు దూరం అయ్యాక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అని రెండు షోలను నిర్వహించడం.. వాటికి రేటింగ్స్ వచ్చేలా చేయడం.. నిర్వాహకులకు కష్టమే అవుతుంది. కనుక కేవలం జబర్దస్త్ అని ఒక్క షోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే.. షోకు ఉన్న కళ ఇంకా తప్పిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పరిస్థితిలో ఇద్దరు యాంకర్లు ఉండరు కదా. కనుక రెమ్యునరేషన్ తక్కువ తీసుకునే రష్మినే కొనసాగిస్తారు. అప్పుడు అనసూయకు చాన్స్ ఉండదు. ఇలా అనసూయను కూడా ఈ షో నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఇది జబర్దస్త్ షోకు భారీ ఝలక్ కానుందని అర్థం చేసుకోవచ్చు.
ఇలా జబర్దస్త్ షోలో మరిన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయని సమాచారం. అయితే ఇదే గనక జరిగితే అప్పుడు ఈ షోకు ఇక రేటింగ్స్ ఉంటాయా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ షో నుంచి పేరున్న కమెడియన్స్ అందరూ ఇప్పటికే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై దీన్ని గతంలో మాదిరిగా ఆదరిస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే ఇవన్నీ సందేహాలే.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. కానీ జబర్దస్త్ భవితవ్యం ఏమిటన్నది ఏనాటికైనా తేలక తప్పదు. అప్పటి వరకు వేచి చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…