Jabardasth Shanthi Swaroop : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది వర్ధమాన నటులకు అవకాశం దక్కింది. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దేశ విదేశాల్లో కూడా జబర్దస్త్ షో కమెడియన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారు చేసే స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. జబర్దస్త్ లో టీం లీడర్లు ఇప్పటికే పాపులర్ కాగా.. ముఖ్యంగా లేడీ గెటప్ లు వేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జబర్ధస్త్ లో జడ్జీలు, యాంకర్స్ ఆడవారు ఉన్నారు కానీ.. మొదటి లో స్కిట్స్ చేసేటప్పుడు ఆడ గెటప్ లో మగవారే వేసుకొని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా శాంతి స్వరూప్ గురించి ముందుగా చెప్పుకోవాలి.
శాంతి స్వరూప్ స్వగ్రామం నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో కొత్తూరు గ్రామం. తండ్రి పేరు రాఘవయ్య. శాంతి స్వరూప్ ది వ్యవసాయ కుటుంబం చదువు పూర్తికాగానే 1998 నుంచి 2001 వరకు ఎస్టీడీ బూత్ లో నెలకు వెయ్యి రూపాయల జీతానికి పనిచేశాడు శాంతి స్వరూప్. చిత్ర పరిశ్రమలోకి రావాలనే కోరికతో హైదరాబాద్ వచ్చాడు. మొదట జబర్ధస్త్ లో ఆఫీస్ బాయ్ గా చేరాడు. రాకెట్ రాఘవ, రచ్చరవిలతో పరిచయం పెంచుకొని చివరకు చమ్మక్ చంద్ర ద్వారా జబర్దస్త్ షోలో ప్రవేశించాడు. యాంకర్ సుమ మొదటగా శాంతి అని పేరున్న ఇతడికి శాంతి స్వరూప్ గా నామకరణం చేసిందట.
ఇక అలా మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలోనే హైపర్ ఆది టీమ్ లీడర్ కావడం.. ఆ టీమ్ లో లేడీ గెటప్ లు వేయడానికి అవకాశం ఇవ్వడంతో శాంతి స్వరూప్ క్రేజ్ బాగా పెరిగింది. ఇక శాంతి స్వరూప్ కు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. నితిన్ నటించిన లై, మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు, ఎన్టీఆర్ నటించిన జైలవకుశ, నెల్లూరు పెద్దారెడ్డి వంటి సినిమాల్లో చిన్న పాత్రలలో అవకాశాలు దక్కించుకొని హాస్య నటుడు కావాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…