Jabardasth : బుల్లితెరపై ప్రసారం అవుతున్న ముఖ్యమైన షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షో హిట్ అయిన తరువాత దీనికి కొనసాగింపుగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ అని ఇంకో షో మొదలు పెట్టారు. ప్రేక్షకులు ఆ షోను కూడా ఆదరించారు. అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ నుంచి అనేక మంది సీనియర్ కమెడియన్లు కూడా బయటకు వెళ్లిపోతున్నారు. అలాగే షోకు గతంలో వచ్చిన రేటింగ్స్ కూడా రావడం లేదు. దీంతో చీప్ ట్రిక్స్ ప్లే చేసి షోకు ఎలాగైనా రేటింగ్స్ తెప్పించాలని నిర్వాహకులు చూస్తున్నారు. అందులో భాగంగానే వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. షోకు రేటింగ్స్ పెంచడం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా.. అంటూ ప్రేక్షకులు నిలదీస్తున్నారు. అయితే ఈ షో భవితవ్యం ఏమవుతుందో తెలియదు కానీ.. అందులో పనిచేసి బయటకు వచ్చిన వారు మాత్రం షో నిర్వాహకులపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక ఆసమ్ అప్పిగా పేరుగాంచిన అప్పారావు కూడా తాజాగా ఇలాగే ఆరోపణలు చేశారు. తనను అన్యాయంగా గెంటేశారని అన్నారు.
తాను జబర్దస్త్ షోలో సీనియర్ కమెడియన్‌ను అని.. అయితే తనకు ఆ మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. జబర్దస్త్ లో మొదట్లో షకలక శంకర్ టీమ్‌లో పనిచేశానని.. తరువాత రచ్చ రవి టీమ్‌లో పనిచేశానని తెలిపారు. ఆ తరువాత పంచ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ టీమ్ లలోనూ చేశానని.. తరువాత తనకు ఆసమ్ అప్పిగా సోలో టీమ్ లీడర్ అయ్యే చాన్స్ ఇచ్చారని అన్నారు. అయితే సోలో టీమ్ లీడర్‌గా కేవలం 11 వారాలు మాత్రమే చేశానని.. ఆ తరువాత కరోనా వచ్చిందని.. కొంత కాలం గ్యాప్ తరువాత వెళ్తే.. ఇప్పుడు కరోనా ఉంది కదా.. మీకు వయస్సు అయిపోయింది.. కొంత కాలం ఆగి చేద్దురుగాని.. అని అన్నారని.. అయితే తాను చాలా కాలం వారి పిలుపు కోసం ఎదురు చూసినా ఫలితం లేదని అన్నారు.
చివరకు ఒక రోజు తానే అడిగితే తిరిగి వచ్చి జబర్దస్త్‌లో చేయమని చెప్పారని తెలిపారు. అయితే తనను తిరిగి టీమ్ లీడర్‌గా కొనసాగించేది లేదని చెప్పారని.. ఏదైనా టీమ్‌లో చేయాలని సూచించారని అప్పారావు తెలిపారు. అయితే తాను తిరిగి బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో పనిచేయనని చెప్పానని.. అందుకు వారు కూడా ఒప్పుకున్నారని.. చివరకు రాకింగ్ రాకేష్ టీమ్‌లో చేసేందుకు అంగీకరించారని అన్నారు. అయితే తనకు టీమ్ లీడర్ కాకుండా మేనేజ్‌మెంట్ డైరెక్ట్‌గా పేమెంట్ ఇవ్వాలని అడిగానని అప్పారావు తెలిపారు. కానీ అందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదని అన్నారు. ఇక చివరకు ఎన్‌వోసీ అడిగితే వెంటనే ఇచ్చారని.. కానీ తాను ఎందుకు ఎన్‌వోసీ అడుగుతున్నది.. ఎందుకు మానేస్తున్నది.. కనుక్కునే ప్రయత్నం చేయలేదని.. ఇది తనకు ఎంతగానో బాధను కలిగించిందని అప్పారావు అన్నారు.
ఒక సీనియర్ కమెడియన్ పట్ల జబర్దస్త్ నిర్వాహకులు ఇలా ప్రవర్తించడం తనకు ఎంతగానో బాధను కలిగించిందన్నారు. అయితే ఇన్ని అవమానాలు భరించలేకే తానే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని అప్పారావు తెలిపారు. వారు తనను అవసరం ఉన్నన్ని రోజులు వాడుకుని అవసరం తీరాక వదిలేశారని బాధపడ్డారు. అయితే తనకు ఇప్పుడు ఎంతో పేరు వచ్చిందని.. టీవీ షోల కన్నా బయట ఈవెంట్ల ద్వారా తాను నెలలో 20 రోజులు బిజీగా ఉంటున్నానని.. కనుక తనకు వచ్చిన నష్టమేమీ లేదని అప్పారావు అన్నారు. ఇక ఇతర టీవీలకు చెందిన షోల నిర్వాహకులు కూడా తమ షోలలో చేయాలని అడుగుతున్నారని.. వీలు చూసుకుని ఓకే చెబుతానని.. అప్పారావు స్పష్టం చేశారు. కాగా అప్పారావు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…