Jabardasth : అనసూయ, ఆది జబర్దస్త్ స్టేజిపై ఉన్నారంటే చాలు.. హాస్యం బాగా పండిస్తారు. ముఖ్యంగా ఆది అనసూయపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు. వాటిల్లో పంచ్‌లు బాగా ఉంటాయి. వాటిల్లో డబుల్ మీనింగ్‌లు కూడా వస్తుంటాయి. ఇక తాజాగా ఆది ఇలాగే అనసూయపై మరోసారి రెచ్చిపోయి పంచ్‌ల వర్షం కురిపించాడు.
అక్టోబర్ 7వ తేదీన ప్రసారం కానున్న జబర్దస్త్‌కు చెందిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. అందులో ఆది స్కిట్‌లో భాగంగా దోశ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాడు. దానికి అనసూయ వస్తుంది. వచ్చీ రాగానే.. అనసూయ ఇక్కడ.. అని అంటుంది. అందుకు అతను.. ఆది ఇక్కడ.. మరి ఏమైనా ఉందా ? అంటూ.. డబుల్ మీనింగ్‌లో పంచ్ వేశాడు.
ఇక దోశ సెంటర్ కు వచ్చిన శాంతిపై కూడా ఆది పంచ్ వేశాడు. శాంతి రాగానే ఇంకా బోనీ కాలేదు, ఎవరైనా బోనీ చేయగానే పదో పరకో ఇస్తా, ఆగు.. అంటాడు. ఇక అనసూయ చేతిని పట్టుకుని ఆది దోశలు ఎలా వేయాలో నేర్పిస్తాడు. దీంతో అనసూయ తనకు దోశ వేయడం వచ్చిందని సంబరపడిపోతుంది. అంతలో ఆది కల్పించుకుని.. అప్పుడే కాదు, ఇంకో రెండు సార్లు తిప్పాలి.. అంటాడు. దీంతో అనసూయకు పంచ్ పడింది.
ఇక స్కిట్‌లో భాగంగా దొరబాబు ఉండి దోశలో తెల్ల వెంట్రుక వచ్చిందని అంటాడు. అందుకు ఆది స్పందిస్తూ.. అనసూయ, చూసుకుని దోశ వేయాలి కదరా.. అంటూ ఆమెకు ముసలితనం వచ్చిందని పరోక్షంగా పంచ్ వేస్తాడు. దీంతో అనసూయ అతన్ని కొట్టేందుకు ముందుకు వస్తుంది. ఇలా ఆది స్కిట్ వచ్చే వారం నవ్వుల పువ్వులు పూయించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…