Upasana : మెగా కోడలిగా ఎంతో గుర్తింపు పొందిన కొణిదెల ఉపాసన ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నీ మధ్యే ఓ కార్యక్రమంలో సద్గురుతో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. చరణ్, ఉపాసన కావాలనే పిల్లల్ని కనడం లేదని.. అందుకు సద్గురు వారిని అభినందించారని.. వార్తలు వచ్చాయి. పెళ్లయ్యాక 10 ఏళ్ల తరువాతే వారు పిల్లల్ని కనాలని అనుకున్నారని.. కనుక ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తి అయ్యాయి కాబట్టి ఇక ఈ సంవత్సరం చరణ్, ఉపాసన కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తి వస్తారు.. అని ఫ్యాన్స్ తెగ ప్రచారం చేశారు. అయితే తరువాత దీనిపై ఉపాసన క్లారిటీ ఇచ్చారు.
ఇక ఉపాసన ఈ మధ్యే కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఆమె హెల్త్ కండిషన్ సీరియస్‌గా ఉందని ప్రచారం చేస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదని స్పష్టమైంది. తాజాగా ఆమె తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసి చరణ్ ఆశీస్సులను తీసుకున్నారు. దీంతో ఆమె ఆ సమయంలో తీసిన ఫొటోను షేర్ చేశారు. అందులో ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
ఇక చరణ్, ఉపాసన విడిపోతున్నారని కూడా కొందరు ప్రచారం చేశారు. కానీ ఆ ఒక్క ఫొటో ద్వారా ఉపాసన పుకార్లన్నింటికీ చెక్ పెట్టినట్లు అయింది. చరణ్‌తో ఆమె ఎంతో సన్నిహితంగా ఉండడాన్ని మనం చూడవచ్చు. అయితే మెగా ఫ్యామిలీపై పుకార్లు రావడం కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్య కాలంలో పుకార్లు ఎక్కువయ్యాయి. మొన్నీ మధ్యే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుందని ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇక శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతుల గురించి కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే వారి విషయమే ఎటూ తేలడం లేదు. కాగా చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా.. ఆ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తేలాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…