IPL Lucknow Team : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్‌లో రెండు కొత్త టీమ్‌లు పోటీ పడుతున్న విషయం విదితమే. ఇప్పటికే అహ్మదాబాద్, లక్నో టీమ్‌లను పలు సంస్థలు సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా లక్నో టీమ్ తమ జట్టు పేరును ప్రకటించింది. ఈ క్రమంలోనే “లక్నో సూపర్ జెయింట్స్” పేరును ప్రకటించారు.
లక్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గొయెంకా సోమవారం ట్విట్టర్ వేదికగా తమ టీమ్ పేరును వెల్లడించారు. ఆర్పీఎస్జీ సంస్థ లక్నో టీమ్‌ను దక్కించుకోగా.. గతంలో ఈ సంస్థ పూణెను కొనుగోలు చేసింది. అప్పట్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఊరు పేరును మాత్రమే మార్చారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పేరును ఖరారు చేస్తూ ప్రకటించారు.
లక్నో టీమ్‌ను రూ.7090 కోట్ల మొత్తానికి ఆర్పీఎస్జీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ టీమ్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్‌గా ఉంటారు. మార్కస్ స్టాయినిస్, రవి బిష్ణోయ్‌లను జట్టు సభ్యులుగా తీసుకుంది. ఇక లక్నో జట్టుకు పేరును నిర్ణయించేందుకు గాను ట్విట్టర్‌లో పోల్‌ను నిర్వహించారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పేరును చివరకు ఖరారు చేస్తూ అదే పేరును ప్రకటించారు. మరి ఐపీఎల్‌లో కొత్త టీమ్ లక్నో అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.
Team owner, Dr. Sanjiv Goenka, Chairman @rpsggroup unveils the name for the Lucknow IPL team. 😊👏🏼#LucknowSuperGiants #NaamBanaoNaamKamao #IPL2022 @IPL @BCCI @GautamGambhir @klrahul11 pic.twitter.com/TvGaZlIgFR
— Lucknow Super Giants (@LucknowIPL) January 24, 2022