మానవుడు కోతి రూపం నుంచి పరిపక్వత చెందుతూ మనిషిగా మారాడని మనకు తెలుసు. కానీ తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో భాగంగా మానవ మనుగడ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. చైనాలో 1933లో హార్బిన్ దగ్గర దొరికింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పుర్రెను జపాన్ ఆర్మీ నుంచి కాపాడాలని ఒక బావిలో దాచిపెట్టారు. తాజాగా దీనిని వెలికితీసి హెబీ Geo యూనివర్శిటీ ప్రొఫెసర్ జి కియాంగ్ చేతిలో పెట్టారు. ఈశాన్య చైనాలో భద్రపరిచిన ఈ పుర్రె పై పరిశోధనలు చేయడంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
ఈ పుర్రె పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఇది మానవ జాతికి చెందిన పురే అయినప్పటికీ విభిన్న జాతికి చెందిన మానవునికిగా గుర్తించారు. ఈ పుర్రె కలిగిన వ్యక్తి సుమారుగా 1,40,000 ఏళ్ల చైనాలో తిరిగినట్లు నిపుణులు గుర్తించారు. అయితే ఈ పుర్రె ఈ భూమి పై మనుషులను పోలి ఉండే ఆదిమానవుడు నియాండెర్తల్స్ తరువాత తరానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు.
ఈ పుర్రేను పరిశీలించిన శాస్త్రవేత్తలు అతడు చనిపోయే సమయానికి 50ఏళ్లు ఉన్నట్లు, ఈ పుర్రె మగ వ్యక్తిదని గుర్తించారు. మెదడు ఎంతో పెద్దగా ఉండి కళ్ళు లోతుగా ఉన్నాయని, మొహం పొడవుగా ఉండి మొదటి భాగం వెడల్పుగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అదేవిధంగా 2019 వ సంవత్సరంలో గ్రీకు గుహలో… ఓ పగిలిన పుర్రె సైంటిస్టులకు దొరికింది. ఆఫ్రికా నుంచి ఆదిమానవులు వేరే ప్రాంతాలకు వెళ్లి జీవించడం వల్లే ఈ విధమైనటువంటి పుర్రెలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు గుర్తించారు.