సాధారణంగా ఏదైనా తప్పుడు పనులు లేదా దొంగతనాలు చేస్తే మనుషులపై ఫిర్యాదు చేయడం గురించి మనం విన్నాం. కానీ కాకుల పై ఫిర్యాదు చేయడం ఎప్పుడైనా విన్నారా.. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా రెండు కాకుల పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన యూకేలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ రెండు కాకులు ఏం చేశాయో తెలుసా..
యూకేలోని కార్లిస్లే అవెన్యూ, లిటిల్ఓవర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా కార్ల విండ్‌స్క్రీన్, వైపర్‌లు పాడవుతున్నాయి. ఎవరో కార్ల మీద గీతలు పెడుతున్నారు.కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉండే కొన్ని విలువైన వస్తువులను దొంగలించి వెళ్తున్నారు. ఈ విధంగా ఎవరో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన స్థానికులు వారిని కనుగొనడం కోసం స్థానికంగా ఉండే యువకులను కాపలాగా పెట్టారు. అయితే కాపలాగా ఉన్న ఆ యువకులకు ఒక షాకింగ్ విషయం తెలిసింది.
గత కొన్ని రోజుల నుంచి వారి కార్లపై బీభత్సం సృష్టిస్తున్నది మనుషులు కాదు, కాకుల అని తెలియడంతో వారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అది కూడా రెండు కాకులు మాత్రమే ఈ విధంగా కారు అద్దాలు పగలగొట్టడం, కారులో ఉన్న వస్తువులు దొంగలించడం వంటి పనులు చేస్తున్నాయని తెలియడంతో వారు ఆ కాకులను తరమడానికి ప్రయత్నించారు. అయితే అవి వెళ్ళినట్టే వెళ్లి తిరిగి అదే పని చేయడంతో ఎంతో విసిగిపోయిన ఆ ప్రాంత వాసులు ఆ రెండు కాకుల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈవిధంగా కాకుల పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కాకులు తమ పనిని కొనసాగిస్తూ ఉండడంతో ఆ ప్రాంతవాసులు ఆ రెండు కాకులకు ఆహారం పెడుతూ వాటిని మచ్చిక చేసుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…