సాధారణంగా తమ పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే లేదా ఎవరైనా కిడ్నాప్ చేస్తే వారి కోసం సాయశక్తులా ప్రయత్నిస్తారు.ఈ విధంగా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు వారి కోసం వెతికిన వారి ఆచూకీ తెలియకపోతే వారిని క్రమంగా మర్చిపోతారు. కానీ ఈ తండ్రి మాత్రం రెండు సంవత్సరాల వయసులో తప్పిపోయిన తన కొడుకు కోసం ఏకంగా ఇరవై నాలుగు సంవత్సరాలు వెతికాడు. కొడుకు కోసం ఏకంగా ఆ తండ్రి ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి 24 సంవత్సరాల తర్వాత తన కొడుకు ఆచూకీ కనుగొని తనని గుండెలకి హత్తుకున్న ఘటన చైనాలో చోటు చేసుకుంది.
చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన గువా గాంగ్‌టాంగ్ కుమారుడు 1997లో తన రెండు సంవత్సరాల కొడుకు కిడ్నాప్ కి గురయ్యాడు. అప్పటి నుంచి తన బిడ్డ ఆచూకీ కోసం దేశమంతా జల్లెడ పట్టాడు. ఏకంగా ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో ఆ తండ్రి ఎన్నో ఇబ్బందులను, ప్రమాదాలను ఎదుర్కొన్నాడు. ఈ తండ్రి తన కొడుకు కోసం చేస్తున్న సాహసం తెలుసుకున్న దర్శకుడు అతడి ప్రయాణంపై ఏకంగా ఓ సినిమానే తీశాడు. ఆ సినిమాలో హాంగ్‌కాంగ్ సూపర్‌స్టార్ ఆండీలువా నటించగా.. సంచలన విజయం సాధించింది.
ఈ విధంగా తన కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ తండ్రి నిరీక్షణ 24 ఏళ్లకు ఫలించింది. ఎట్టకేలకు గాంగ్‌టాంగ్ తన కొడుకును గుర్తించాడు. అయితే తన కొడుకా కాదా అన్న అనుమానంతో అధికారులు వీరికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా వీరిద్దరూ తండ్రీకొడుకులని తేలడంతో ఆ తండ్రి కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా గాంగ్‌టాంగ్ తన కొడుకుని ఎత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విధంగా తనకు కొడుకు కోసం ఆ తండ్రి చేసిన సాహసం తెలుసుకున్న నెటిజన్లు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…