సాధారణంగా మనం మొసలిని చూడగానే దాని క్రూరత్వం గుర్తుకు వచ్చి వెంటనే భయంతో ఆమడ దూరం పరిగెడతాము. ఒక్కసారి మొసలి చేతికి దొరికామంటే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అంతటి భయంకరమైన జంతువు ఒక ఆలయానికి కాపలాగా ఉందని విషయం తెలిస్తే ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అయితే ఈ ఆలయానికి వచ్చిన భక్తులను ఏమీ అనదు.. అదే విధంగా పూజారి చెప్పిన మాటను ఎంతో చక్కగా వినే ఈ మొసలి కేరళలో అనంత పద్మనాభ ఆలయంలో ఉంది.
అనంత పద్మనాభ ఆలయంలోని సరస్సులో ఉండే ఈ మొసలిని భక్తులందరూ బబియా అనే పేరుతో పిలుస్తారు. ఈ సరస్సుకు ఆనుకొని ఉన్న పద్మనాభ ఆలయానికి మొసలి కాపలాగా ఉంటుంది. ఈ మొసలి ప్రత్యేకత ఏమిటంటే ఇది మాంసం ముట్టుకోదు, కేవలం ప్రతిరోజు ఆలయంలో పెట్టే ప్రసాదం మాత్రమే స్వీకరిస్తుంది. కొన్నిసార్లు ఈ మొసలి సరస్సు నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఆలయంలో భక్తులకు ఏ మాత్రం హాని కలిగించదు. పూజారి చెప్పిన విధంగా నడుచుకోవడం దీని ప్రత్యేకత.
కథనం ప్రకారం 1945లో.. అంటే సుమారు 76 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో సంచరిస్తున్న మొసలిని చంపేశాడు. మొసలిని చంపిన కొద్ది రోజులకే ఆ సైనికుడు పాముకాటుకు గురై మరణించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సైనికుడు చనిపోయిన కొన్ని రోజులకే ఈ సరస్సులో మరో మొసలి కనిపించడంతో ఇదంతా ఆ భగవంతుని కృప అని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. ప్రస్తుతం ఈ మొసలికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…