సాధారణంగా రైల్వే స్టేషన్ లో రైలు దిగగానే ఎక్కడికి వెళ్లవలసిన ప్రయాణికులు అక్కడికి వెళ్తుంటారు. కానీ బీహార్ రైల్వే స్టేషన్ లో మాత్రం రైలు దిగగానే ప్రయాణికులు ఎక్కడ ఆగకుండా ఉన్నఫలంగా పరుగులు తీశారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని కొంతవరకు ఆందోళన చెందారు. ప్రస్తుతం పలు రాష్ట్రాలలో కరోనా కేసులు అధికమవడంతో ఎక్కడ లాక్ డౌన్ విధిస్తారేమోనని వలస కూలీలు అందరు ముందుగానే తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.
వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి తరలిరావడంతో బీహార్ లో కూడా కరోనా కేసులు అధికంగా పెరిగాయి.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
బీహార్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లో అధికారులు ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు.దీంతో రైల్వే స్టేషన్ లో దిగిన ప్రయాణికులు ఎక్కడ తమకు కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ అయితే 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని ప్రయాణికులు రైలు దిగగానే ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.