భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టాలని ప్రధాని మోదీకి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశీ వైద్య నిపుణులు కూడా భారత్‌లో కఠిన లాక్‌డౌన్ అమలు చేయడం ఒక్కటే మార్గమని ఇప్పటికే సూచించారు. ఇక తాజాగా కోవిడ్ పరిస్థితిని సమీక్షించడం కోసం జాతీయ స్థాయిలో నియమింపబడ్డ టాస్క్ ఫోర్స్ సభ్యులు కూడా దేశంలో లాక్‌డౌన్ పెట్టాలని మోదీకి సూచించారు.
దేశంలో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవడం, కోవిడ్ నియంత్రణ వ్యూహాలను పర్యవేక్షించే నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వాక్సినేషన్ (ఎన్ఈజీవీఏసీ) దేశంలో మరోమారు లాక్‌డౌన్ పెట్టాలని మోదీకి సూచించింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్ గా ఉన్న డాక్టర్ వీకే పాల్ నేరుగా ప్రధాని మోదీకి నివేదిస్తారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున దేశంలో మరోమారు లాక్‌డౌన్ పెట్టాలని ఆయన మోదీకి సూచించారు.
అయితే ఇటీవల సీఎంలతో నిర్వహించిన సమావేశం అనంతరం దేశంలో లాక్ డౌన్ ఉండదని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసినట్లు చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలను పాటించడం, టీకాలను తీసుకోవడం ఒక్కటే మన ముందున్న మార్గమని, లాక్‌డౌన్ అనేది చివరి స్టెప్ అని స్పష్టం చేశారు. కానీ దేశంలో పరిస్థితి చూస్తే రోజు రోజుకీ దిగజారిపోతోంది. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ సూచించిన మేర మోదీ లాక్‌డౌన్‌పై పునరాలోచన చేస్తారా, లేదా, అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…