మా అమ్మ చావు బతుకుల్లో ఉంది, ఆక్సిజన్ సిలిండర్ సరఫరా అయ్యేలా చూడండి.. అని ఓ వ్యక్తి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్‌కు గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఆ మంత్రివర్యులు మాత్రం ఎక్కువ మాట్లాడితే రెండు చెంప దెబ్బలు కొడతానని బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోలో ఉన్న జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ గురువారం సదరు హాస్పిటల్‌ను సందర్శించారు. అయితే ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి తన తల్లి కోవిడ్‌తో చికిత్స పొందుతుందని, ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ సిలిండర్ 2 గంటలే వస్తుందని, కనుక ఆక్సిజన్ సిలిండర్ సరఫరా అయ్యేలా చూడాలని మంత్రిని కోరాడు. అయితే అందుకు ప్రహ్లాద్ పటేల్ అసహనం ఫీలయ్యారు. ఎక్కువ మాట్లాడితే రెండు చెంప దెబ్బలు కొడతానన్నారు. అయినా సరే తాను చెంప దెబ్బలు తినేందుకు కూడా సిద్ధమని, కానీ ఆక్సిజన్ సిలిండర్‌ను మాత్రం ఇవ్వాలని, లేదంటే తన తల్లి చనిపోతుందని అతను ప్రాధేయపడ్డాడు.
కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నెటిజన్లు కూడా ఆయన వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఓ వ్యక్తి సహాయం చేయమని వస్తే ఆయన అలా అనడం అత్యంత హేయమైన చర్య అని కామెంట్లు చేశారు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం ఆ వ్యక్తి పరుష పదజాలంతో మాట్లాడాడని, అందుకనే మంత్రి అలా అన్నారని, అందులో వేరే ఉద్దేశం లేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహాయం చేయమని అడిగిన వారిని అలా అనడం సరికాదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…