సాధారణంగా మనం స్వామివారికి మొక్కులు తీర్చాలంటే ప్రదక్షణలు చేయడం, స్వామి వారికి కానుకలు చెల్లించడం, ఆలయానికి ఏవైనా దానం చేయడం ద్వారా మొక్కులు చెల్లిస్తారు. కానీ ఒడిస్సా రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఒక వింత ఆచారాన్ని పాటిస్తూ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.మయూర్ భంజ్ జిల్లాలో వరూన్ బ్లాక్ ప్రాంతంలో స్థానికులు ఆచరిస్తున్న ఈ సంప్రదాయం.. దాన్ని చూస్తున్న వారి కళ్లల్లో భయం పుట్టిస్తుంది.
ఇక్కడి ప్రజలు స్వామివారికి పూజలు చేయాలన్న, మొక్కులు తీర్చుకోవాలన్న ముళ్ళు కలిగిన నాగ జముడు మొక్కలపై పొర్లుదండాలు పెట్టీ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇది మాత్రమే కాదండోయ్ నిప్పులపై సరదాగా, అమ్మవారిని పూజిస్తూ డాన్సులు చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా ఇక్కడి ప్రజలు అమ్మవారికి కి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఒడిస్సాలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రజలు ఇప్పటికీ ఇదే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.
ముఖ్యంగా దేవీ నవరాత్రులైన దసరా వంటి పండుగ దినాలలో ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ఈ విధంగా మొక్కులు తీర్చు కోవడం జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే ఈ విధంగా ముళ్ళ మొక్కలపై పొర్లుదండాలు పెట్టిన వారి శరీరానికి ఏమాత్రం గాయాలు తగలవు, నిప్పులపై నడిచిన వారికి ఏ విధమైనటువంటి నొప్పి తగలదనీ అక్కడి ప్రజలు చెబుతారు. ఈ విధంగా స్వామివారికి మొక్కులు తీర్చడం వల్ల వారికి ఏమీ కాకుండా వారిని ఆ దుర్గామాత కాపాడుతుందని అక్కడ భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.