దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకే రోజులో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,12,262 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,980 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యంత ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
ఇక దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 2,30,168కి చేరుకుంది. 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,20,113 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జి అయ్యారు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,72,80,844కు చేరుకుంది. ఇక ఒకే రోజులో 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కావడం ఇది రెండో సారి. మే 1వ తేదీన 4,01,993 కేసులు నమోదయ్యాయి.
మే 5వ తేదీన భారత్‌లో 3.82 లక్షల కోవిడ్ కేసులు నమోదు కాగా 3,780 మంది ఒకే రోజులో చనిపోయారు. ఇక 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది 15వ రోజు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మొత్తం 29,67,75,209 శాంపిల్స్‌ను ఇప్పటి వరకు పరీక్షించింది. ఒక్క మే 5వ తేదీనే 19,23,131 శాంపిల్స్ ను పరీక్షించారు.
దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గడ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ బీహార్, హర్యానాలలో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడమే కాగా యాక్టివ్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…