దేశవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తున్న నేపథ్యంలో డాక్టర్లు వైద్య సిబ్బంది కనిపించే దేవుళ్ళుగా కరోనాతో పోరాడుతున్న ఎంతోమందికి ప్రాణాలను నిలబెట్టారు. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్లు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తమ ముందే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసి పోవడంతో మానసిక ఆందోళన చెంది చివరకు తన ప్రాణాలను కూడా వదులుకున్నాడు ఆ డాక్టర్.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన డాక్టర్ వివేక్ రాయ్ ఢిల్లీలోని మాళవీయనగర్ లో నివాసం ఉంటూ సౌత్ ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ కరోనా సమయంలో వందల మంది ప్రాణాలను కాపాడిన వివేక్ మరెంతో మంది సరైన సదుపాయాలు లేక చనిపోవడంతో అతడు ఎంతో మానసికంగా ఆందోళన చెందాడు. ఈ మానసిక ఆందోళనలో పడి తన భార్య రెండు నెలల గర్భవతి అన్న విషయం కూడా మర్చిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
డాక్టర్ వివేక్ కి గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. ప్రస్తుతం తన భార్య రెండు నెలల గర్భవతి. వివేక్ గత కొద్ది రోజులుగా ఐసీయూలో కరోనా పేషెంట్ లకు చికిత్స అందిస్తున్నారు.అయితే వీరిలో చాలా మంది పరిస్థితి విషమించి తన కళ్లెదురుగా ఎంతోమంది ప్రాణాలు పోవడంతో మానసికంగా ఆందోళన చెందిన డాక్టర్ వివేక్ శనివారం సాయంత్రం తన ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…