మహమ్మారి కరోనా ఎంతో మందిని తమ ఆత్మీయులకు దూరం చేసింది. చివరి చూపులకు కూడా నోచుకుండా చేస్తోంది. తమ ఆత్మీయులను కడసారి చూసేందుకు కూడా వీలు లేకుండా చేసింది మాయదారి కరోనా. ఈ క్రమంలోనే ఎన్నో లక్షల మంది ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా చనిపోయారు. అనేక చోట్ల శ్మశానాల్లో కుప్పలు తెప్పలుగా కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారు. కాగా కరోనా బారిన పడ్డ ఓ డాక్టర్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
ముంబైకి చెందిన సెవ్రి టీబీ హాస్పిటల్ డాక్టర్ మనీషా జాదవ్‌కు కరోనా సోకింది. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలే ఓ రోజు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఇదే నాకు చివరి గుడ్ మార్నింగ్. ఇదే చివరి పోస్టు. ఇకపై ఈ ప్లాట్‌ఫాంలో మిమ్మల్ని కలుసుకోలేను. అందరూ జాగ్రత్తగా ఉండండి. శరీరం చనిపోతుంది. ఆత్మ కాదు. ఆత్మకు మరణం లేదు. అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఈ క్రమంలో ఆమె పోస్టు పెట్టిన మరుసటి రోజు మృతి చెందింది. దీంతో ఆమె పోస్టు వైరల్‌గా మారింది.
ఆ డాక్టర్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు అందరినీ విచారానికి గురి చేస్తోంది. అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. దిక్కుమాలిన కరోనా ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో కదా అంటూ అందరూ కరోనాను తిట్టిపోస్తున్నారు. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ 18వేల మంది డాక్టర్లకు కోవిడ్ సోకగా వారిలో 168 మంది చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…