దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ 3వ దశ కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌లను ఇస్తున్నారు. అయితే చాలా మంది భయంతో కోవిడ్ టీకాలను వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయి. అయితే ప్రజల్లో వ్యాక్సిన్ల పట్ల అవగాహన కల్పించేందుకు, వారిని టీకాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ వినూత్న స్కీమ్‌ను ప్రకటించింది.
కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకునేవారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. టీకాలను తీసుకునే వారు ఆ బ్యాంకులో ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్‌లో భాగంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే దానిపై 25 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీని అందిస్తారు. ఆ బ్యాంకు తాజాగా ఈ స్కీమ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. దీన్ని పరిమిత కాలపు ఆఫర్‌గా ఆ బ్యాంకు తెలిపింది. అందువల్ల కోవిడ్ టీకాలు తీసుకునే వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ వేసే ఆలోచన ఉంటే ఆ బ్యాంకులో ఎఫ్‌డీ వేయవచ్చు. దీంతో అదనపు వడ్డీ లభిస్తుంది.
ఇక ఆ ఎఫ్‌డీ కింద వినియోగదారులు కనీసం 1,111 రోజుల పాటు అయినా డబ్బును డిపాజిట్ చేయాలి. అప్పుడే అదనపు వడ్డీ లభిస్తుంది. దేశంలో కోవిడ్ టీకాలను తీసుకునేందుకు చాలా మంది సందేహిస్తున్న నేపథ్యంలో టీకాలను తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకే ఆ బ్యాంకు ఈ స్కీమ్‌ను ప్రకటించింది. మరి దీని కింద ఎంత మంది ఎఫ్‌డీలను వేస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…