దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి కోవిడ్ టీకాలను వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాలు మాత్రం తమ వద్ద తగినన్ని కోవిడ్ టీకాలు లేవని తెలిపాయి. ఇంతకు ముందు కోవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఇచ్చేందుకే టీకాలు లేవని, అందువల్ల 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలను ఇవ్వలేమని కొన్ని రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. దేశంలో టీకాల కొరత ఏర్పడినందునే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమయంలో ప్రజలకు ఊరటనిచ్చే వార్త ఒకటి వచ్చింది.
మే 1వ తేదీ నుంచి దేశంలో రష్యాకు చెందిన స్పుత్‌నిక్-వి టీకాలను పంపిణీ చేయనున్నారు. రష్యా నుంచి తొలి లాట్ టీకాలు శనివారం భారత్‌కు రానున్నాయి. భారత్‌కు స్పుత్‌నిక్-వి టీకాలను దిగుమతి చేసుకునేందుకు డాక్టర్ రెడ్డీస్‌కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అందులో భాగంగానే తొలి లాట్ మే 1వ తేదీన భారత్‌కు రానుంది. దీంతో వ్యాక్సిన్లకు కొంత వరకు కొరత తీరనుంది. అయినప్పటికీ పెద్ద ఎత్తున టీకాల అవసరం ఏర్పడింది.
కాగా దేశంలో ప్రస్తుతం భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో స్పుత్‌నిక్-వి టీకా వాటి సరసన చేరనుంది. రష్యాలోని గమాలెయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీనికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గతంలోనే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ టీకాల కొరత ఉన్న తరుణంలో స్పుత్‌నిక్-వి టీకాలు వస్తుండడం కొంత వరకు ఊరటనిస్తోంది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 16.33 కోట్ల టీకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చామని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1 కోటి డోసులు ఉన్నాయని, మరో 3 రోజుల్లో 19 లక్షల డోసులను అందజేస్తామని తెలిపింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…