ఎవరూ లేని అనాథ అతను. నిన్న మొన్నటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. వారు కాస్తా దూరం కావడంతో అతని పరిస్థితి కడు దయనీయంగా మారింది. మానసిక వ్యాధి గ్రస్తుడు కావడంతో అతను ఎక్కడ హాని చేస్తాడేమోనని గ్రామస్థులు అతన్ని గొలుసులతో కట్టేసి విడిచి పెట్టారు. దీంతో అతన్ని పట్టించుకునే వారు లేక అత్యంత దీనావస్థలో అతను జీవితాన్ని గడుపుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో బధ్రాజి అనే గ్రామం ఉంది. అక్కడ 40 ఏళ్ల రాజారాం చక్రవర్తి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని తల్లి 3 నెలల కిందట చనిపోగా తండ్రి చనిపోయి 1 నెల అయింది. అయితే అతను మానసిక వ్యాధిగ్రస్తుడు. ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. కానీ వారు చనిపోయాక రాజారాం పరిస్థితి దయనీయంగా మారింది.
అతను మానసిక వ్యాధిగ్రస్తుడు కావడంతో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. గ్రామంలో తిరుగుతూ రాళ్లను తీసుకుని కిటికీల అద్దాలు, వాహనాలను బద్దలు కొట్టేవాడు. దీంతో గ్రామస్థులు గొలుసులు, తాళ్లతో అతని కాళ్లు, చేతులను కట్టేసి విడిచిపెట్టారు.
అయితే అతను అలా బంధించబడి గ్రామంలో తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఆ గ్రామ పంచాయతీ అధికారులను మీడియా ప్రశ్నించింది. అతనికి మానసిక వ్యాధి గ్రస్తుల కోటా నుంచి నెల నెలా ప్రభుత్వ సహాయం అందుతోంది. కానీ అతన్ని హాస్పిటల్‌లో చేర్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. అయితే మీడియా ఈ విషయాన్ని వారి దృష్టికి తేగానే తాము తప్పు చేశామని అంగీకరించారు. వెంటనే అతన్ని ప్రభుత్వ మానసిక హాస్పిటల్‌లో చేరుస్తామని చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…