ప్రస్తుతం కరోనా భారత దేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. భారత దేశంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడంతో ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులు లేని అనాధలుగా మిగిలిపోయారు.ఈ విధంగా అనాథగా మారిన చిన్నారులను ఆదుకోవడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది.
కరోనాతో తల్లిదండ్రులు మృతి చెంది పిల్లలు అనాధలుగా మిగిలారో అలాంటి వారికి నెలకు రూ.5వేలు కోవిడ్ పెన్షన్ ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వారి చదువు బాధ్యత, దుస్తుల నుంచి పుస్తకాల వరకు కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని చౌహన్ తెలిపారు.
కరోనా వల్ల ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలారు. అలాంటి వారందరిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని,ప్రతి నెల వీరికి పెన్షన్ తో పాటు రేషన్ కూడా అందిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు.