India Corona : కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో రోజు రోజుకీ తగ్గుతోంది. దీంతో కొత్తగా నమోదవుతున్న కేసులతోపాటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. ఈ క్రమంలోనే తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 1 లక్ష దిగువకు చేరుకుంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. అయితే కరోనా రెండో వేవ్ ప్రభావం తగ్గుతున్నప్పటికీ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. మళ్లీ కోవిడ్ ఆంక్షలను అమలు చేసే దిశగా రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి.
ఇక మంగళవారం దేశవ్యాప్తంగా 11,08,467 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 8,954 మందికి వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయింది. 10,207 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దిగువగా.. 99,023 వద్ద ఉంది.
దేశవ్యాప్తంగా 3.45 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 3.40 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. గతేడాది మార్చి నుంచి ఇదే అత్యధికం కావడం విశేషం. 24 గంటల వ్యవధిలో 267 మంది కోవిడ్‌తో చనిపోయారు. కేరళలో 177 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 4,69,247కు చేరుకుంది. మంగళవారం 80,98,716 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 124 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…