Liver : మన శరీరంలో ఉండే అనేక అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు, శక్తిని గ్రహించి శరీరానికి అందిస్తుంది. రక్తంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయ పడుతుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. ఇలా కాలేయం అనేక రకాల పనులు చేస్తుంది. అయితే కొన్ని రకాల కారణాల వల్ల లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో క్రమేణా లివర్ చెడిపోతుంది. అయితే లివర్ పనితీరు మందగించినప్పుడే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యం బాగాలేదని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ లివర్ సమస్య ఉన్నట్లు తేలితే ముందుగానే చికిత్స తీసుకోవచ్చు. దీంతో లివర్ చెడిపోకుండా కాపాడుకున్నవారమవుతాము. ఇక లివర్ పనితీరు బాగాలేనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. గ్యాస్, కళ్ల కింద నల్లని వలయాలు, కోపం, విసుగు, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, మొటిమలు, దురదలు, దద్దుర్లు, మహిళలకు అయితే రుతుక్రమం సరిగ్గా లేకపోవడం, నిద్రలేమి, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఫుడ్ అలర్జీలు, భోజనం చేశాక వికారంగా ఉండడం.. ఇవన్నీ లివర్ పనితీరు మందగించిందని తెలియజేసే లక్షణాలు. కనుక ఇవి ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం ఉత్తమం. దీంతో లివర్ పూర్తిగా చెడిపోకుండా ముందుగానే అడ్డుకోవచ్చు.
ఇక లివర్ పనితీరు మందగించేందుకు అనేక కారణాలు ఉంటాయి. మెడిసిన్లను అధికంగా వాడడం, మద్యం ఎక్కువగా సేవించడం, అధిక బరువు వంటి కారణాల వల్ల లివర్ అనారోగ్యం బారిన పడుతుంది. అయితే వీటి నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి. దీని వల్ల కూడా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలా లివర్‌ను రక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…